WORLD MUSIC. ENGLISH MUSIC. HINDI MUSIC. Mutyala Music Home Facebook Youtube

కర్ణాటక సంగీతం - ప్రధాన అంశాలు

కర్ణాటక సంగీతము - ప్రధాన అంశాలు
.
.
శృతి
------
.
శ్రుతి అంటే ధ్వని విశేషం. గీతానికి పనికి వచ్చే శ్రుతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం)కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది. శృతి అనగా స్థాయిని సూచిస్తుంది. ఈ సంగీతంలో ఇతర అంశాలకు ఇది ప్రాథమిక భావన లాంటిది.[3]. ఇది పాశ్చాత్య సంగీతంలో టానిక్ లేదా కీ కి దగ్గరగా ఉంటుంది. అష్టమ స్వరాల్లో స్థాయీ భేధాన్ని సూచించడానికి కూడా దీనిని వాడుతుంటారు. ఒక రాగంలో ఎన్నిరకాలైన స్థాయి భేదాలైనా ఉండవచ్చు కానీ సాధారణ మానవుని చెవి కేవలం ఇరవై రెండింటిని మాత్రమే గుర్తించగలదు. ఒక్కోసారి శ్రోత దృష్టిలో ఇది భావాన్ని కూడా సూచిస్తుంది.
.
.
స్వరం
---------
.
ఈ సంగీతంలో స, రి, గ, మ, ప, ద, ని అని సప్త స్వరాలు (ఏడు స్వరాలు) ఉంటాయి. ఇవి షడ్జమ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత, నిషధ అనే పొడవైన పేర్లకు సంక్షిప్త రూపాలు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు తప్పని మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉండాలన్న నియమం లేదు.ఇతర సంగీత ప్రక్రియల్లాగా కాకుండా ఈ ఏడింటిలో షడ్జమానికీ, పంచమానికీ, మధ్యమానికీ తప్ప మిగతా స్వరానికీ మూడు ఉప రీతులు ఉంటాయి. షడ్జమానికీ, పంచమానికీ ఒకే రీతి, మధ్యమానికీ రెండు ఉపరీతులూ ఉంటాయి.
.
.
రాగం
-------
.
కర్ణాటక సంగీతంలో రాగం అంటే ఏదైనా ఒక మాధుర్యాన్ని పలికించడానికి ఏర్పరిచిన కొన్ని నిబంధనల సమాహారం.ఇది పాశ్చాత్య సంగీతంలో మోడ్ (mode) కు దగ్గరగా ఉంటుంది. ఆరోహణ, అవరోహణలు ఎలా సాగాలి అన్నదానికి కూడా నిభందనలు ఉన్నాయి. సప్త స్వరాలయిన స, రి, గ, మ, ప, ద, ని రాగం యొక్క ఆరోహణా అవరోహణల్లో ఖచ్చితంగా వున్న రాగాలని మేళ కర్త రాగాలంటారు. వీటి సంఖ్య 72. వీటినే జనక రాగాలని కూడా అంటారు. ఈ మేళ కర్త రాగాలనుండి పుట్టిన రాగాలని జన్య రాగాలంటారు. అంటే ఆరోహణా, అవరోహణల్లో ఒకటీ లేదా రెండు స్వరాలు వర్జితం కావచ్చు, కొన్ని అదనంగా ఉండచ్చు. ఈ జన్య రాగాలకీ అనేక విభజనలున్నాయి.
.
.
తాళం
--------
.
సంగీతంలో వినిపించే మరోధ్వని విశేషం తాళం. దీనినే లయ అని కూడా అంటారు. తాళం అంటే నిర్ణీత కాలవ్యవధిలో క్రమబద్ధమైన, లయబద్ధమైన రీతిలో వచ్చే ఒక దరువు. శ్రుతి లయలు సంగీత మాధుర్యానికి ఆధారాలు. అట్టి తాళంలో కూడా రకాలున్నాయి. ఆది తాళం 8 మాత్రలతో కూడింది. చుతాళ లేక ఏక తాళం 12 మాత్రలతో కూడింది. జపతాళ 10 మాత్రలతో, రూపక్ తాళ 7 మాత్రలతోను, తీన్ తాళ 16 మాత్రలతో కూడినది.
ఇది పాటతో పాటు మారదు. అన్ని పాటలకూ ఒకే విధంగా ఉంటుంది. కర్ణాట సంగీత కళాకారులు ముఖ్యంగా తమ చేతులనూ, వేళ్ళను పైకి, క్రిందకూ ఆడించడం ద్వారా దీన్ని అనుసరిస్తారు. హిందుస్థానీ సంగీతంలో తాళాన్ని పలికించడానికి, అనుసరించడానికి తబలాను ఉపయోగిస్తారు. కర్ణాటకసంగీతంలో అయితే మృదంగమును ఉపయోగిస్తారు. సప్త తాళములు మరియు అంగ లక్షణములు .
.
ధృవ తాళం ( 1 0 1 1 )
.
మత్య తాళం ( 1 0 1 )
.
రూపక తాళం ( 0 1 )
.
ఝంపె తాళం ( 1 U 0 )
.
త్రిపుట తాళం ( 1 0 0 )
.
ఆట తాళం ( 1 1 0 0 )
.
ఏక తాళం ( 1 )
.