కర్ణాటక సంగీతం - గ్రంథాలు
గ్రంథాలు:
=====
.
.
.
1) సంగీత వాజ్మయమునకు ఆది గ్రంథముగా పేర్కొనబడు క్రీ.పూ. 4 వ శతాబ్దమునాటి భరతముని విరచిత నాట్య శాస్త్రము
2) ప్రాచీన గ్రంథము - శిలప్పాధికారం
3) దత్తిల - దత్తిలుని గ్రంథము - దత్తిలము
4) కోహాల - కోహలుని గ్రంథము - సంగీతమేరు
5) నందికేశ్వర - నందికేశ్వరుని గ్రంథము - భరతావర్ణవము
6) మతంగ - మాతంగుని గ్రంథము - బృహద్దేశి
7) కశ్యప
8) యక్షటిక
9) అభినవగుప్త - అభినవగుప్తుని గ్రంథము - అభినవభారతి
10) మాతృగుప్త
11) శంకుక
12) రుద్రట
13) నాన్యదేవ - నాన్య భూపాలుడు గ్రంథము - భరతభాష్యము
14) భోజదేవ
15) సోమేశ్వర
16) ముమ్మట
17) కీర్తిధర
18) భట్టగోపాలుడు - భట్టగోపాలుని గ్రంథము - తాళదీపిక
19) శారదాతనయుడు - శారదాతనయుని గ్రంథము - భావప్రకాశము (నాట్యకళ గూర్చి), శారదీయము (సంగీతము గూర్చి)
20) భోజదేవుడు - భోజదేవుని గ్రంథము - సరస్వతీకంఠాభరణము
21) పార్స్వదేవుడు - పార్స్వదేవుని గ్రంథము - సంగీతసమయసారము
22) లోల్లటుడు
23) ఉద్భటుడు
=================
24) శారంగదేవుడు (క్రీ.శ.1210-1247) - సంగీత రత్నాకరము
25) చతురకల్లినాధుడు
26) సిమ్హభూపాలుడు
27) కుంభకర్ణ భూమీశుకుడు
28) ఒప్పర్టుదొరగారు - గ్రంథము - సంగీత రత్నాకర చంద్రిక
29) కేశవ - సంగీతసుధ
30) హరిపాలదేవుడు - హరిపాలదేవుని గ్రంథము - సంగీత సుధాకరము
31) విద్యారణులు - గ్రంథము - సంగీతసార (కర్ణాటక సంగీతము అంకురింపజేసే ననుటకు రాగములను మేళకర్తలగా క్రోడీకరించు పద్ధతిని తెలియజేసినాడు. ఈయన చెప్పిన మేళకర్త పద్ధతియే కర్ణాటక సంగీతమును ఉత్తరదేశపు సంగీతము(రాగ రాగిణి పద్ధతి)నుండి వేరుచేస్తోంది)
32) సోమనార్యుడు (క్రీ.శ. 1609) - రాగవిబోధ
33) వేంకటమఖి - గ్రంథము - చతుర్దండి ప్రకాశిక (మేళకర్త రాగాల వర్గీకరణ పద్ధతిని కనుగొన్నారు)
34) గోవిందాచార్య (సంపూర్ణ మేళకర్త రాగాల పట్టికను తయారు చేసారు)
35) వీణా శేషన్న (1852 - 1926), వీణా సుబ్బన్న (1861 - 1939) (ట్రావెంకూర్ మరియు మైసూర్ రాజులు ఆస్థాన సంగీత విద్వాంసులు)
===================
36) పురందర దాసు (1480-1564)
37) త్యాగరాజు
38) ముత్తుస్వామి దీక్షితులు
39) శ్యామశాస్త్రి
40) అరుణాచల కవి
41) అన్నమాచార్య
42) నారాయణ తీర్థులు
43) విజయదాసు
44) రామదాసు
45) సదాశివ బ్రహ్మేంద్ర
46) ఊటుకూరి వెంకటకవి
47) స్వాతి తిరునాళ్
48) గోపాలకృష్ణ భారతి
49) నీలకంఠ శివన్
50) పట్నం సుబ్రమణి అయ్యర్
51) మైసూరు వాసుదేవాచారి
52) ముత్తయ్య భాగవతార్
53) కోటీశ్వర అయ్యర్
54) సుబ్రహ్మణ్య భారతీయార్
55) పాపనాశం శివన్
.
.
మనకు లభ్యమగు ప్రాచీన సంగీతశాస్త్ర గ్రంథములు స్వల్పములయ్యు వాని వలన ఆకాలపు సంగీతమునుగూర్చి కొంత తెలుసుకొనుటకు వీలు కలదు. సంగీత వాజ్మయమునకు ఆది గ్రంథముగా పేర్కొనబడు క్రీ.పూ. 4 వ శతాబ్దమునాటి భరతముని విరచిత నాట్య శాస్త్రము , తరువాతి క్రీ.శ.1210-1247 ప్రాంతమునాటి శారంగదేవుని సంగీత రత్నాకరము స్వతంత్ర గ్రంథములుగ తెలియబడుచున్నవి. ఈకాలము వరకు దత్తిల, కోహాల, నందికేశ్వర, మతంగ, కశ్యప, యక్షటిక, అభినవగుప్త, మాతృగుప్త, శంకుక, రుద్రట, నాన్యదేవ, భోజదేవ, సోమేశ్వర, ముమ్మట, కీర్తిధర మొదలగు సంగీతవేత్తలు భరత నాట్యమును పురస్కరించుకొని వ్యాఖ్యానములు, గ్రంథములను రచించిరి. అంతేకాక తమ గ్రంథములను భరతాంకితముగ వెలయుచుండిరి. నాన్య భూపాలుడు తన గ్రంథమును భరతభాష్య మనెను.నందికేశ్వరుని భరతావర్ణవము, అభినవగుప్తుని అభినవభారతి మున్నగునవి ఇట్టివే. కోహలుని సంగీతమేరు, మాతంగుని బృహద్దేశి, దత్తిలుని దత్తిలము, భట్టగోపాలుని తాళదీపిక, శారదాతనయుని భావప్రకాశము భోజదేవుని సరస్వతీకంఠాభరణము, పార్స్వదేవుని సంగీతసమయసారము మున్నగు కొన్ని గ్రంథములు స్వతంత్రములుగ రాయబడినను అవిభరతగ్రంథమున గల వివిధ విషయములలో నాట్యకళకు సంబంధిచిన కొన్ని విషయములను ముఖ్యముగ అలంకార రసాదులను, విపుల పరిచించినారు. పెక్కు గ్రంథములు నాట్యకళ పరమావధిని గూర్చి, అనగా రసమును గూర్చి మగ్నతతో చెప్పినారు.ఎట్లైనను భరతనాట్యశాస్త్రానుగత సంగతులను అనేకములుగ జేసి చెప్పుటవలన అవి సంగీతరత్నాకరము కాలమువరకు అంతగ స్వతంత్ర గ్రంథములుగ తెలియలేదు. లొల్లట, ఉద్భట, శంకుక, కీర్తిధర, అభినవగుప్త ఆచార్యాదుల గ్రంథములు నాట్య శాస్త్రమునకు వ్యాఖ్యానములు. కావున 13వ శతాబ్దమువరకు గల సంగీత గ్రంథములు భ్రతనాట్యశాస్త్రమునకు సంబందిచినవే అని చెప్పుకోవచ్చును. కాని వీటిలో సంగీతమునకు సంబందించిన విషయములు ఉండుటవల వీటిని సంగీతమును అభ్యసించువారు చదువెడివారు.
.
.
సంగీత రత్నాకరము:
--------------------------
.
శారంగదేవునివలన రచింపబడిన సంగీత రత్నాకరము' మీద పెక్కువ్యాఖ్యానములున్నవి, వానిలో ఆంధ్ర కృతములు జనసమ్మతము లగుచుండెననియు తెలియుచున్నది. అట్టి ఆంధ్రవ్యాఖ్యాతలలో ముఖ్యులు చతురకల్లినాధుడు, సిమ్హభూపాలుడు, కుంభకర్ణ భూమీశుకుడు మున్నగువారు. ఒప్పర్టుదొరగారు తమ సంస్కృత వ్రాత గ్రంథములో సంగీతరత్నాకరచంద్రికా అను వ్యాఖ్యానమును చెప్పెను. గ్రంథకర్తపేరు తెలియదు. కేశవ అను బ్రాహ్మణుడు మరియొక వ్యాఖ్యానమును రచించినట్లు సంగీతసుధ యందు తెలియుచున్నది. ఇది ఇప్పటి మద్రాసు గ్రంథాలయమునందు ఉన్నది.
.
.
రాగార్ణవము:
---------------
.
క్రీ.శ. 1609వ సంవత్సరమున ఆంధ్రభారతాచార్యుడగు సోమనార్యుడు రచించిన రాగవిబోధా యందీగ్రధముగూర్చి తెలియుదును. 14వ శతాబ్దము మధ్యమున రచింపబడిన సారంగధరపద్ధతీ అను గ్రంథమునకు ఈ రాగార్ణవము తోడగుచున్నట్లు అందు తెలియుచున్నది. గ్రంథ కర్త తెలియరాకపోయినను ఈగ్రంథము ఆంధ్రవాగ్గేయకరులచే ఆదరింపబడినది.
.
.
హరిపాలదేవుని సంగీత సుధాకరము:
-----------------------------------------------
.
ఈ గ్రంథము మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకాలయమునను, తంజావూరు గ్రంథాలయమునను కలదు. గ్రంథకర్త అయిన హరిపాలదేవుడు భూపాలకుడని గ్రహింతుము. చాళుక్య రాజులలో హరిపాలుడు అనుపేరుగలవాడు కలడని, ఈ గ్రంథకర్త ఆయనేయుండునని కొందరు ఎంచిరి. ఈయన శ్రీరంగ క్షేత్రమున పోయి అక్కడ నటీనటులకు వారికోరికపై సంగీతము ఏర్పరచినట్లు గ్రంథమున కలదు. వారిచెప్పిన మతము సంగీతసుధాకర గ్రంథముననుసరించిననియు దెలిపినాడు.
.
.
శారదాతనయ:
------------------
.
శారదాతనయ భావప్రకాశము అను గ్రంథము నాట్యకళ గూర్చియు, శారదీయము అనునది సంగీతము గూర్చియు రచించెను. ఇతడు బ్రాహ్మణుడు. కాశ్యప గోత్రుడు. భావప్రకాశ గ్రంథము మైసూరు ప్రాంతమందలి మేల్ కోట రాజువద్ద నొకప్రతియు, మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయమున ఒక ప్రతియు కలదు.
.
.
విద్యారణ్యుల సంగీతసారము:
--------------------------------------
.
విద్యారణ్యుడు ఈయన ఆంధ్ర బ్రహ్మణుడు.ఈయన సంస్కృత వాజ్మయమునకు మిగుల తోడై పెక్కు శాస్త్రములందు గ్రంథములను వ్రాసినాడు.ఈయన కర్ణాటక సంగీతము అంకురింపజేసే ననుటకు రాగములను మేళకర్తల గా క్రోడీకరించు పద్దతిని తెలియజేసినాడు. ఈయన చెప్పిన మేళకర్త పద్దతియే కర్ణాటక సంగీతమును ఉత్తరదేశపు సంగీతమునుండి వేరుచేయుచున్నది. ఉత్తరదేశమున రాగ రాగిణి అను పద్దతి అమలో ఉండెను. విద్యారణ్యులిట్లు మేళపద్దతి నేర్పరచి ఆంధ్రుల ప్రతిభను చాటినాడు. విద్యారణులు వ్రాసిన సంగీతసార ఇప్పుదు అలభ్యము. బికనీరు గ్రంథాలయమున ఈపేరు గల గ్రంథము ఒకటి కలదు. కాని అది క్రీ.శ. 1565 లేక 1506 కాలమునాటిదని దెలియుటచే అది విద్యారణ్యులు వ్రాసినది కాదని తెలియుచున్నది.
.
.