•అనువాదపు సంగీతం•
రబీంద్ర సంగీత్
==============================================
==============================================
==============================================
==============================================
==============================================
==============================================
అనువాదపు సంగీతం
హిందుస్తానీ సంగీతంలో కూడా ఖయాల్ వంటి ముఖ్య అంశాలు అయిన తరువాత ఝుమ్రీ, తరానా, ఠప్పా, దాద్రా వంటివి పాడడం ఆచారంగా వెనకటినుంచి సాగుతునే ఉన్నది. ఇక భజన్లను గురించి ఎంత చెప్పినా తక్కువే. కుమార్ గంధర్వ్ నోట కబీర్ భజన్లు విన్న తరువాత మరో సంగీతం అనవసరం అనిపిస్తుంది. మరాఠీలో వర్కారీ (లేక వార్కరీయా?) భక్తులు పాడే అభంగులు కూడా ఈ రకంలోకే వస్తాయి. భీమ్సేన్ జోషీగారు, పురందరుల పాటనో, తుకారం అభంగునో ఎత్తుకున్నారంటే సంగీతం ముక్క తెలియని వారికి కూడా ఒళ్లు పులకిస్తుంది. లయకు కదలడం మొదలవుతుంది. కొంతమంది గాయనీ గాయకుల కారణంగా అభంగ్లు కర్ణాటక కచేరీలలోకి ప్రవేశించాయి. మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో శ్రీమతి అరుణా సాయిరాం, కచేరీ చివరల్లో ఒక అభంగ్ పాడేవారు.
రబీంద్ర సంగీత్ - రవీంద్ర సంగీత్ - తెలుగు ప్రభావం
=================================
రబీంద్ర సంగీత్ ఆంగ్లంలో టాగూర్ గీతాలు గా పిలువబడేది, సాధారణంగా భారతదేశం మరియు ప్రత్యేకంగా బెంగాల్ సంగీత భావనకు క్రొత్త పరిమాణాన్ని అందించిన, రబీంద్రనాథ్ టాగూర్ స్వరపరచిన సంగీత రూపం. రబీంద్ర సంగీత్, భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు సంప్రదాయ జానపద సంగీతం ఆధారంగా రూపొందింది. టాగూర్ సుమారు 2,230 గీతాల్ని రచించాడు. గీతాలలోని నిర్మలమైన కవిత్వం, సృష్టికర్త, ప్రకృతి మరియు ప్రేమలను ఏకం చేసింది. మానవ ప్రేమ (ప్రేమ్) చివరికి సృష్టికర్త పట్ల ప్రేమ మరియు అంకితభావంగా (భక్తీ) రూపాంతరం చెందుతుంది.
బాలాంత్రపు రజనీకాంతరావుగారి రబీంద్ర సంగీత్ను తెలుగువారికి పరిచయం చేయడంతోపాటు ఆయన సూఫీ సంగీతాన్ని, మధ్యప్రాచ్య సంగీత ధోరణులను అందరికీ పరిచయం చేసారు. తెలుగునాట బాలాంత్రపు రజనీకాంతరావుగారు రవీంద్ర సంగీత్ పాటలను తెలుగుచేసి అదే వరసల్లో పాడించారు. ‘నని వికసించెనదే, పక్షీ ఏలరాదు’ ‘ఒకడినె పదవోయ్’ లాంటి పాటలు నాకింకా చెవుల్లో గింగురుమంటాయి. ఒకసారి రేడియో వారు ఒక బెంగాలీ గాయకుడిని, ఒక తెలుగు గాయకుని (చిత్తరంజన్గారు?) పక్కపక్కనే కూర్చోబెట్టి, ఒకే పాటను, రెండు భాషల్లో వెంట వెంట వినిపించేవారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది.
రబీంద్ర సంగీత్
==============================================
==============================================
కబీర్ వాణి – తెలుగు
కబీర్ వాణి గొప్ప కవిత్వపు విలువలు ఉన్నట్టిదే కాక, ఆధ్యాత్మిక సత్యాలు ఎన్నింటినో నిక్షిప్తం చేసుకొన్న గ్రంథం భగవత్తత్వం గురించి, భగవత్ ప్రేమ గురించి, ఆధ్యాత్మిక మార్గం గురించి, మాయా ప్రపంచం గురించి వారు చెప్పిన విషయాలు, చేసిన విశ్లేషనలను విశిష్టమైనవిగా పరిగణిస్తారు. కబీర్ సామాన్య మానవుడికి, సాధకుడికి ఇద్దరినీ ఉద్దేశించి, అందరికీ అర్థం అయ్యేట్టు చెప్పినారు. అయితే వాటిలో కొన్నింటిని సామాన్యులకు అందుబాటులో ఉన్న భాషలో, మరి కొన్నింటిని ద్వంద్వార్థాలతో కూడిన భాషలో చెప్పినారు. వారి వచనాలను హిందీ భాషలో దోహాలని పిలుస్తారు. వారు తమ దోహాలలో అనేక విషయాల గురించి ప్రస్తావించి, మానవుడికి మార్గదర్శిగా నిలిచారు.
==============================================
==============================================
తెలుగు గజల్స్
గజల్ ఉర్దూ కవితాసాహిత్యంలో అత్యంత ప్రముఖ సాహితీ ప్రక్రియ
మరియు కవితా రూపం. గజల్ అనగా 'స్త్రీ సంభాషణ', 'స్త్రీల సంభాషణ'. 'స్త్రీ సౌందర్యాన్ని'
వర్ణించడానికి గజల్ వాడే వారు. గజల్ అనే పదం 'గజాల్' 'గజాల' నుండి ఆవిర్భవించింది
(మూలం టర్కీ భాష), అర్థం 'జింక', 'జింక కనులు గల', 'మృగనయని'. పర్షియన్లు ఖసీదా ద్వారా
దీన్ని వాడుకలోకి తెచ్చారు.10 వ శతాబ్దంలోఇరాన్ లో గజల్ ఆవిర్భావం జరిగినది.12 వ శతాబ్దంలోముస్లిం
రాజుల ప్రాబల్యంలో, మొగలులు ఇరానీయుల ఆచారవ్యవహారాలతో పాటు గజల్ ను ఇరాన్ నుండి భారతదేశానికి
దిగుమతి చేశారు. అమిర్ ఖుస్రో ఉత్తరభారతంలో గజల్ ను ప్రారంభించాడని చెబుతారు కాని,నిజానికి
గజల్ దక్కనులోనే మొదలయింది. గజల్లు పర్షియన్ భాషలో జలాలుద్దీన్ మొహమ్మద్ రూమి (13వ
శతాబ్దం), హాఫిజ్ (14 వ శతాబ్దం) మరియు తుర్కీ కవి ఫుజూలి, భారత కవులు మిర్జా గాలిబ్
(1797-1869), ముహమ్మద్ ఇక్బాల్ (1877-1938) ఇరువురూ పారశీ మరియు ఉర్దూ భాషలలో గజల్
రచించారు.
గజల్.. గాలికి ఊగే గులాబీ బుగ్గ మీద వాలిన సీతాకోక చిలుక చేసే
తియ్యని గాయమే కాదు పదునైన కత్తి మీదుగా జారిన తేనే చుక్క పెదవులపై జారి నట్టుండే విషాదానుభవాన్నీ
అంతే భావతీవ్రతతో చెప్పగలిగిన ప్రక్రియ.మెత్తగా మనసుని జోకొట్టే సంగీతం లోంచి మరింత
మెత్తగా మనసుని హత్తుకునే భావంతో గుండె చప్పుడు కదా గజల్. మనసుకు హత్తుకునే కొన్ని
గజల్స్ భాషతెలీదు భావమూ తెలీదు అయినా మెహదీ,జగ్జీత్ ల తో అలాకొన్ని అడుగులేసి..ఝుస్తు
జూ జిస్ కి థీ అన్న ఆశా తో గొంతుకలిపి.”జిందగీ రోజ్ నయీ రంగ్ బదల్తీ క్యోం హై? అన్న
ఉమ్రావ్ జాన్ ప్రశ్నతో పాటే కాస్త ఆహ్లాదవిశాదాన్ని మొహానికి పులుముకొని.. “మై శాయర్
తో నహీ లేకిన్ గజల్ కహెనె కో జీ చాహా… అని మరిన్ని క్షణాల పాటు కలవరించిన మనుషులెందరో…
మరి అదే గజల్ తెలుగులో పలకరిస్తే..!? అంతటి మృదుత్వాన్ని ఏదో
ఒక గొంతుక అమ్మ భాషలో స్పర్షిస్తే? అంతకంటే ఆనందమేఉంది. సినారే తో పాటుగా గజల్ ని తన
ఊపిరిగానే శ్వాసించుకున్న కొన్ని విశాదామృత గుళికలనీ,ప్రేమ స్పర్శల రాగాలనీ కాగితం
పై ఒలకబోసినప్పుడు ఆనందమేస్తుంది… “ఓయ్ జగ్జీతూ…! ఇలా వచ్చి నాపక్కన కూచో తెలుగు గజలొకటి వినిపిస్తా కాసేపు
జీవించి చూడు”
అని
చెప్పాలనిపించేటంత ఆనందం.”చౌదవీకి చాంద్ హో” అని పాడిన రఫీ కోసమూ “కంటపొంగిన వెతలవేడికి
రెప్పకాలెను ఎందుకో” అని తెలుగు లో పాడివినిపించాలనిపిస్తుంది.
ఐతే ఇప్పటికీ తెలుగులో వచ్చిన గజళ్ళు తక్కువేం కాదు కానీ అతితక్కువ
మాత్రమే ప్రాచుర్యం పొందాయి. దీనికి కారణాలేమిటో తెలియదు. కానీ..తెలుగు గజల్ దాని దక్కనీ
పర్షియన్ ఉర్దూ మూలాలని వదిలి తెలుగుగజల్ గా మారటానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది.ఈ
క్రమం లో ఎందరో గజల్ ని తెలుగు అలంకరణలతో మళ్ళీ మళ్ళీ ముస్తాబు చేసి మరింత దగ్గరగా
తెచ్చే ప్రయత్నమూ చేసారు. హిందీ ఉర్దూ లో ఉన్నటువంటి గజల్స్ (పరిపూర్ణం గా సమాంతరం కాకపొయినా)
కి స్ఫూర్తి తో తెలుగు గజల్స్ .. తెలుగు
భాష లో కొందరు ఔత్సాహికులు గజల్స్ ను తెలుగు లో ప్రయత్నించారు.
==============================================
==============================================
తెలుగు ఖవ్వాలి
ఖవ్వాలి - సూఫీ తత్వనికి చెందిన ఓ ఆధ్యాత్మిక సంగీత విధానము. ఈ ఖవ్వాలీల ప్రధానోద్దేశ్యం ఈశ్వరప్రేమ, మానవప్రేమ, భక్తి, ముక్తి మరియు సర్వమానవ సోదరభావాలు. ఇది దక్షిణాసియాలో చాలా ప్రాచుర్యం పొందినది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో అమితంగా ప్రాచుర్యం పొందినది. ఈ కళారీతిలో ఖవ్వాలీ సాహిత్యానికి, సంగీతానికి సూఫీ తరీకా అవలంబీకులు తన్మయమై ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు. ఈ ఆధ్యాత్మికానందంలో అల్లాహ్ కు దగ్గరౌతారని, అల్లాహ్ కు పొందుతారనే విశ్వాసం.
అరబ్బీ భాషలో ఖౌల్ అనగా ముహమ్మద్ ప్రవక్త యొక్క ప్రవచనము, ఖవ్వాల్ అనగా ఈ ఖౌల్ ను కవితా రూపంలో గానంచేసేవాడు. ఖవ్వాలీ ఆవిర్భావం 8వ శతాబ్దంలో పర్షియా (నేటి ఇరాన్-ఆప్ఘనిస్తాన్ ప్రాంతం) లో జరిగింది. 11వ శతాబ్దంలో సాంప్రదాయిక సంగీతమైన సమా లేదా సమాఖ్వాని భారత ఉపఖండం, టర్కీ మరియు ఉజ్బెకిస్తాన్ లలో ప్రవేశించినది. అమీర్ ఖుస్రో చిష్తియా తరీకాకు చెందినవాడు, ఇతను ఢిల్లీలో వుండేవాడు, పర్షియన్ సంగీతాన్ని మలచి, భారతీయ సంగీతంగా రూపొందించాడు. ఇతడి సూఫీ కవితలు, ఖవ్వాలీలు జగత్-ప్రసిద్ధి. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి ఆద్యుడుగానూ ఇతనికి భావిస్తారు. సాధారణంగా ఖవ్వాలీ పాట కచ్చేరీని గాని సభను గాని మెహఫిల్-ఎ-సమాగా వ్యవహరిస్తారు. ఖవ్వాలీ పార్టీ ఉపయోగించే వాద్య పరికరాలు:
హార్మోనియం
1.
తబలా
2.
ఢోలక్
3.
క్లేరియోనెట్
4.
సితార్
5.
సారంగి
6.
రుబాబ్
7.
బుల్బుల్ తార
ఖవ్వాలి కచేరి ఇచ్చే కళాకారుల గ్రూపుకు "పార్టీ" (ఉర్దూలో హమ్నవా) అని సాధారణంగా సంబోధిస్తారు. సాధారణంగా ఎనిమిది లేక తొమ్మిది మంది గల గ్రూపు. ఇందులో ప్రధాన గాయకుడు (ఖవ్వాల్), తోడు గాయకులు ఇద్దరు (ప్రధాన గాయకుడికి ఇరువైపులా), ఒకటి లేదా రెండు హార్మోనియంలు (ఒక హార్మోనియంను ప్రధాన గాయకుడు స్వయంగా వాయిస్తాడు), తబలా, ఢోలక్, బుల్బుల్ తార వాయిద్యకారులు, మరియు మిగతావారు కోరస్ గా వుంటారు.
ఈ ఖవ్వాలి ప్రధానంగా ఉర్దూ మరియు పంజాబీ భాష లలో కానవస్తుంది. కొన్ని పాటలు పారశీకంలోనూ వుంటాయి. భారత్ లో ఐతే, బ్రజ్భాష, మరియు ప్రాంతీయ భాషల యాసలు, ప్రాంతీయ భాషల ఉపయోగాలూ కానవస్తాయి. ప్రాంతీయ భాషలలోనూ ఖవ్వాలీలు కానవస్తాయి. ఖవ్వాలీలకు భాషల అంక్షలు లేవు. ఆంధ్రప్రదేశ్ లోనూ అక్కడక్కడా తెలుగు భాషోపయోగం జరిగడం కానవస్తుంది.
==============================================
==============================================
==============================================
==============================================
==============================================
==============================================
సూఫి సంగీతం - తెలుగు
'సూఫీ' అంటే 'కంబళి బట్ట' అని అర్థం.సూఫీ తత్వవేత్తలు భౌతిక
సౌఖ్యాలకు లోనుకాక, నిరాడంబరమైన కంబళి బట్టలు ధరించడం వల్ల ఈ మతానికి 'సూఫీ' అని పేరొచ్చింది.'సూఫీ'
అంటే- పవిత్రతకు, (భౌతికబంధాల నుంచి) స్వేచ్ఛకు సంకేతం! సూఫీ యోగి అంతర్దృష్టితో ధ్యానతత్పరుడై,
సత్యాన్వేషకుడై ఉంటాడు.ధ్యాన దైవిక ప్రేమ భావనతోపరమాత్మ లో లీనం కావడమే సూఫీ సిద్ధాంతం.
పలు విధాలైన సూఫీ సంగీతం సూఫీ కవిత్వాన్ని ఆలపించేదిగా ఉంటుంది. సూఫీ సంగీత ధ్వనులని బాబా ఫరీద్, బల్లే షా, షా హుస్సేన్,
వారిస్ షా, మియాన్ మహమ్మద్ బక్ష్ వంటి సూఫీ కవుల కృతులు గానం చేస్తూంటారు.
==============================================
==============================================