•భక్తి సంగీతం•
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి: అన్నారు పెద్దలు. ఆది ప్రణవనాదమైన ఓంకారం నుండి ఉధ్బవించినడిగా చెప్పబడే సంగీతం గురించి చూద్దాం.
సంగీత నాట్యకళలు భారతజాతి అంత ప్రాచీనమైనది. భారతీయ సంగీతానికి మూలం వేదాలు - వేదాలలోని స్వరాలు. ఋగ్వేదం మంత్రాల గురించి వివరిస్తుంది. ఈ మంత్రాలకు మొన్ని లయాత్మక పదాలు చేర్చి పాడేవారు. వీటిని 'స్తోభాలు' అంటారు. రుగ్వేద కాలంలో ఉదాత్త, అనుదాత్త, స్వరిత అనే స్వరాలు ఉచ్ఛరించేవారు. కాలక్రమేణా వీటిని ఉచ్ఛ, వచ, స్వర, విశిష్టలతో సృష్టించారు. ఈ విధానం తరువాత ఏకస్వరమైన ఆర్చిక పఠనంగా మరింది. యజ్ఞయాగాలు జరిపే సమయంలో హాత, ఉద్గాత, సామిక అనే పేర్లతో స్వరాలను పాడేవారు. వేదకాలంలో ఏక (ఆర్చిక), ద్విస్వరాలు (గాధిక్యం), దిస్వర (సామిక) పేర్లతో రూపొందింది. కాలక్రమేణా చతుస్వరి (నాలుగు), పంచస్వరి (ఐదు), షట్స్వరి (ఆరు), సప్తస్వరి (ఏడు)గా మారాయి. కాలక్రమంగా సప్తస్వర యుక్తమైన ఒక స్థాయిని మన పూర్వీకులు అందించారు.
సామవేదము భారతీయ సంగీతానికి మూలం. ఇందులో ఏడు నుండి పది స్వరాలు వాటి సంగతులున్నాయి. ఇవి వికార, విశ్లేష, వికర్షణ, అభ్యాస, విరామ, స్తోభాలు మొదలైనవి. అవి ఈనాటికీ సంగీతంలో గమకాలుగా ఉంటాయి. మరికొంత కాలానికి సంగీతంలో వాది-సంవాది, ఆరోహణ-అవరోహణ, మంద్ర-తారా స్థాయిలు మొదలైన ప్రక్రియలు వచ్చాయి.
భక్తి సంగీతము : ఈ సంగీత సంప్రదాయము భక్తి రస ప్రధానము. ఈ సంప్రదాయము ఆయా వాగ్గేయకారుల పద్యములు, భజనలు, సంస్కృత శ్లోకములను కలిగి వుండును. సాధారణముగా శ్లోకముల వంటివాటికి తాళము చెప్పబడదు.
భక్తి సంగీతము
ఈ సంగీత సంప్రదాయము భక్తి రస ప్రధానము. ఈ సంప్రదాయము ఆయా వాగ్గేయకారుల పద్యములు, భజనలు, సంస్కృత శ్లోకములను కలిగి వుండును. సాధారణముగా శ్లోకముల వంటివాటికి తాళము చెప్పబడదు.
"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి:" అని ఆర్యోక్తి. అనగా గాన రసాన్ని శిశువులు పశువులతో పాటు పాములు కూడా విని ఆనందిస్తాయని అర్థం.
మన పురాణ కాలంలో శ్రీ కృష్ణుడు అద్భుతంగా వేణునాదం ఆలపించేవాడని దానికి గోవులు, గోపికలు, మునులు సైతం తాదాత్మ్యం పొదేవారిని చెబుతారు.అంతే కాదు నారద తుంబురులు, హనుమంతుడు గొప్ప నాదోపాసకులుగా కీర్తి పొందారు. రాజస్థాన్ ఎడారి మరు భూమిలో మిరాబాయి కృష్ణ భక్తి గాగాన ప్రవాహాన్ని ప్రవహింప చేశారు.ఆమె గానాన్ని అక్బర్ చక్రవర్తి సైతం మారువేషంలో వచ్చి వినేవాడని చెబుతూ ఉంటారు.
ప్రాచీన సంగీత శాస్త్రాలుగా భావించే భరతుని నాట్య శాస్త్రం, సంగీత మార్గదమ్, రాగ సారంగిణీ వంటి గ్రంథాలలో 'ధ్రువద్ ' అనే ఒక సంగీత కళా రీతిని చెప్పారు. దీనిని దేవుని అర్చనా కార్యక్రమాలలోనూ, యజ్ఞాల నిర్వహణలోనూ వినియోగించుకునేవారు. ఈ ధ్రువద్లో కూడా అనేక రీతులున్నట్లు తత్కోవిధులు పేర్కొంటారు. హరిదాసు, త్యాగరాజు వంటి కళాతపస్వులు 'నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి సుఖమా?'అంటూ సంగీతాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకుపోయారు. రాగ సృష్టి సంగీత ప్రపంచానికి భారతదేశం అందించిన గోప్ప కానుకగా భావిస్తారు. రాగాలకు సంబంధించిన మూల భావాలు సామవేదంలో ఉన్నట్లు సంగీతకోవిదులు చెబుతారు. మన సంప్రదాయ సంగీతములోని రెండు స్రవంతులకు కూడా రాగమే అధారం.
అన్నమయ్య
జంత్ర సహాయంతో (తాంబూరా) కృతులు ఆలపించే సంప్రదాయాన్ని (కర్ణాటక సంగీతంలో) ప్రచారంలోకి తెచ్చిన వారు తాళ్ళపాక అన్నమాచార్యులు క్రీ.శ.1408- 1503 మధ్యకాలంలో జీవించిన అన్నమయ్య తిరుమల శ్రీ వెంకతేశ్వర స్వామి భక్తుడై తన పదహారవయేట ఆరంభించిన పద రచనలు (కీర్తనలు) 3200 సంకీర్తనలుగా రూపుద్దిద్దుకున్నాయి. కర్ణాటక సంగీతంలో పల్లవి, అను పల్లవి, చరణం అన్న పద్దతిని ప్రవేశ పెట్టిన మహానీయుడాయన. అప్పటి వరకు దక్షిణ దేవాలయాలలో ఉన్న 'తేవారం ' దివ్య ప్రబంధ పఠనం అనే స్తుతి రీతులకు ఇది భిన్నమైనదే గాక రాగయుక్తంగా, శాస్ర్తోక్తంగా, భక్తితో జన బాహుళ్యం పాడుకోగల రీతిలో ఆయన పదరచనలు కొనసాగాయి. లాలి పాటలు, చందమామపాటలు, మేలుకొలుపు పాటలు, దంపుళ్ళ పాటలు వంటివి ఆయన పదాలలో ప్రత్యేకతను నంతరించకున్నప్పటికీ వీటన్నింటిలోను వాత్సల్య భక్తితో పాటు భగవంతుని లీలలే వర్ణితములై సంగీత సాహిత్య పారమార్థిక భావనలు త్రివేణి సంగమంలా కలిసిపోయి అన్నమయ్య కీర్తనలు బహుళ ప్రచారం పొందాయి.
అన్నమయ్య తర్వాత కర్ణాటక సంగీతంలో సంకీర్తనా సంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చినవాడు పురందరదాసు.
18,19 శతాబ్దాలు కర్ణాటక సంగీతానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కాలంగా భావిస్తారు. అందుకు ప్రధానమైన కారణం దాక్షిణాత్య సంగీతానికి త్రిమూర్తులుగా భావించే శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, త్యాగరాజస్వామి ఈ కాలానికి చెందిన వారు కావడమే. ఈ ముగ్గురు కూడ తమ ఇష్ట దైవాలమీద సుమధురమైన భక్తి రసప్రధానమైన కృతులను ఆలపించడమే కాక తమ సర్వస్వం భగవదర్పితం చేసిన భక్తాగ్రేసరులు. శ్యామశాస్త్రుల కంచికామక్షీ, అమ్మవారి పైన త్యాగరాజు శ్రీరామ చంద్రునిపైన, ముత్తు స్వామి దీక్షితులు ఆయా క్షేత్ర దైవాల పాటు అంబ పైన కృతుల నెన్నింటినో వినిపించి కర్ణాటక సంగీతం పై చెరగని ముద్రవేశారు. వీరిలో శ్యామశాస్త్రి, త్యాగరాజుల జీవితాలు దాదాపు ఒకే రకంగా ఉండడమే కాదు వారి కీర్తనలు కూడా భక్తిరస ప్రవాహములు కాగా, ముత్తు స్వామి కృతులు లోత్తెన భావాలతో కూడినవే గాక మంత్ర రహాస్యాలతో కూడినవిగా పరిశీలకులు భావిస్తారు.
పై ముగ్గురి తర్వాత కర్ణాటక సంగీతానికి అపారమైన సేవ చేసిన వారు సుబ్బరామ దీక్షితులు. వీరు తమ జీవిత కాలంలో (1859- 1906) 'సంగీత సంప్రదాయ ప్రదర్శనమ్ ' అన్న గ్రంధాన్ని వెలుగులోకి తేవడమే కాక ఉత్తరాదివారి వలె కర్ణాటక సంగీతంలో కూడా గురు శిష్య సంప్రదాయాన్ని నెలకొల్పారు.
అమరమైన సంగీత కళామ తల్లికి సేవ చేసిన ఎందరో మహానుభావులకు వందనాలు తెలుపుకొంటూ, బ్రహ్మానంద సంధాయకరమైన సంగీతాన్ని సుసంపన్నం చేస్తూ తత్కోవిదులు పూనుకుంటారని కోరుకుందాం.
సంగీత మపి సాహిత్యం సరస్వత్వాకుచద్వయం - ఏకమాపాత మధురం అన్యదాలోచనా మృతం.
1. రామామాత్యుడు — స్వరమేళకళానిధి 15
2. నారాయణ తీర్థులు — శ్రీకృష్ణలీలా తరంగిణి 158
3. సిద్దేంద్రయోగి — భా మూ కలాపము
4. చతుర దామోదరుడు — సంగీత దర్పణము 157
5. పుండరీక విఠలుడు — సదాగ చంద్రోదయము 159
6. మాధవ భట్టు — సంగీత చంద్రిక 1614
7. తానప్పాచార్యుడు — సంగీత శాస్త్రము 160
8. భావభట్టు — సంగీత లక్షణర 20 జనకరాగాలు
9. గోవింద దీక్షితుడు — సంగీత సుధానిధి 154
10. వెంకటమఖి — చతుర్దండి ప్రకాశిక 72, మేళకర్తల దర్శకుడు 162
11. గోవిందా మాత్యుడు — సంగీత శాస్త్ర సంక్షేపః 157
12. క్షేత్రయ్య — క్షేత్ర యు పదములు 16
13. రామదాసు — కీర్తనలు దాశరధీ శతకము 165
కొన్ని రామదాసు కీర్తనలు 170
14. తూము నరసింహ దాసు — మంగళము-హెచ్చరిక
15. తాళ్ళపాకము చిన్నయ — కీర్తనలు, దివ్యనామ కీర్తనలు మొ.
16. సహజీ మహారాజు — పల్లకీ నాటకము 163
17. రామస్వామి దీక్షితులు — కీర్తనలు 177
18. శ్యామశాస్త్రీ — స్వరజాతులు తానవర్ణాలు
19. త్యాగయ్య — కీర్తనలు 176, వేలకొలది కీర్తనలు 176 ,
ప్రహ్లాద విజయము;- నౌకోచరిత్ర. మొు. ,
సంస్కృత కీర్తనలు 177
20. ఎట్టయ్యప్ప మహారాజు — కీర్తనలు 176
21. సుబ్బరామ దీక్షితులు — సంగీత సంప్రదాయ పదర్శిని,
సంగీత లక్షణ సంగ్రహము 19
22. మునిపల్లె సుబహ్మణ్యకవి — అధ్యాత్మరామాయణ కీర్తనలు 173
23. స్వాతి తరునాళ్ మహారాజు — పదాలు తిల్లానాలు కృతులు 182
===========================================================
జయ దేవుని అష్టపదులు
===========================================================
త్యాగ రాజ కృతులు
===========================================================
క్షేత్రయ్య పదములు
===========================================================
రామదాసు కీర్తనలు
===========================================================
సదాశివ బ్రహ్మేంద్ర
===========================================================
===========================================================
క్షేత్రయ్య పదములు
===========================================================
రామదాసు కీర్తనలు
===========================================================
సదాశివ బ్రహ్మేంద్ర
===========================================================
ఎం . ఎస్ . సుబ్బ లక్ష్మి
===========================================================
మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
===========================================================
భక్తి రంజని
===========================================================
===========================================================
భక్తి రంజని