కర్ణాటక సంగీతం - మనోధర్మ సంగీతం
.
.
1) రాగాలాపన
---------------
.
ఆలాపన అంటే లయతో సంబంధం లేకుండా రాగాన్ని ఆలపించడం.సాధారణంగా మనోధర్మ సంగీతంలో దీనిని సులభమైన ప్రక్రియగా పరిగణిస్తారు. ఎందుకంటే మిగతా ప్రక్రియలతో పోలిస్తే ఇందులో నియమ నిబంధనలు తక్కువగా ఉండటమే. కానీ వీనులవిందైన ఒక సంపూర్ణమైన రాగాలాపన చేయడం మాత్రం కష్టమైన విషయమే. ఇందుకు చాలా నైపుణ్యం అవసరమౌతుంది.
.
.
.
2) నిరావల్
-----------
.
సాధారణంగా దీన్ని అనుభవజ్ఞులైన గాయకులు మాత్రమే ఆలపిస్తారు. ఇందులో ఒకటి లేదా రెండు లైన్లను పదే పదే వివిధ స్థాయీ భేదాలతో, వేగంతో ఆలపించడం జరుగుతుంది.
.
.
.
3) కల్పనా స్వరం
-------------------
.
దీనినే స్వర కల్పన అని కూడా అంటారు. ఇది ప్రాథమిక స్థాయికి చెందినది. మనోధర్మ సంగీతంలో మొదటగా ఈ ప్రక్రియనే బోధిస్తుంటారు.
.
.
.
4) తానం
--------
.
మనోధర్మ సంగీతంలో ముఖ్యమైన వాటిల్లో ఒకటైన ఈ ప్రక్రియ మొదటగా వీణ కోసం రూపొందించబడింది.
.
.
.
5) రాగం ~ తానం ~ పల్లవి
-----------------------------
.
ఇది సుధీర్ఘమైన ప్రదర్శనల్లో ముఖ్య అంశంగా ఉంటుంది.
.
.