WORLD MUSIC. ENGLISH MUSIC. HINDI MUSIC. Mutyala Music Home Facebook Youtube

హరికథా పితామహుడు" అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు - మరుపురాని మరికొందరు హరిదాసులు



హరికథా పితామహుడు" అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు - మరుపురాని మరికొందరు హరిదాసులు



హరి కథను అత్యంత ఉత్తమ కళారూపంగా తీర్చి దిద్ది దానికొక గౌవవాన్నీ, విశిష్టతనూ చేకూర్చినవారు ఆదిభట్ల నారాయణ దాసుగారు. ఆయన ఎన్నో హరికథలు రచించారు. ఎంతో మంది ఉద్ధండులైన శిష్య ప్రశిష్యులను తయారు చేశారు.

ఇంటా బయటా పేరు పొందిన ఆదిభట్ల నారాయణదాసు

ఆదిభట్ల నారాయణదాసు 1864 సంవత్సరం శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకాలో సువర్ణ ముఖీతీరంలో వున్న అజ్జాడ గ్రామంలో జన్మించారు. వీరు ద్రావిడ బ్రాహ్మణులు. తల్లి నర్ఫసమాంబ. తండ్రి వేంకటచయనులు, చిన్ననాడే తల్లి ద్వారా భాగవతాన్ని విని అధ్యాత్మికత్వాన్ని జీర్ణించుకున్నారు. తండ్రి ద్వారా పాడిత్యాన్నీ, కవిత్వాన్నీ నేర్చు కున్నారు. నారాయణ దాసు గారు స్వయంకృషి వలన సకల విద్యల్నీ అపార జ్ఞానాన్ని సంపాదించారు. దాసుగారు బొబ్బిలి వాస్తవ్యుడైన వాసా సాంబయ్య వద్ద కొంతకాలం వీణ నేర్చుకున్నారు. తరువాత విజయనగరం మహారాజావారి కాలేజీలో యఫ్.. వరకూ చదివి తరువాత ఆంగ్ల విద్యకు స్వస్తి చెప్పారు. దాసుగారు ప్రప్రథమంగా యక్షగానాలను తరువాత హరికథా ప్రబంధాలను రచించారు. షేక్స్ పియర్, కాళిదాసు గ్రంధాలను అనువాదం చేశారు. వీణా వాదన లోనూ, నృత్య సంగీతాల్లోనూ అసమానమైన ప్రజ్ఞాను సంపాదించారు. లయలో యన సామర్థ్యం సాటిలేనిది. చల్ల పల్లి జమీందారు గారిచే గజయాన, గండపెండేర సత్కారాన్ని పొందారు.

దర్బారుల్లో సన్మానాలు

ఆదిభట్ల నారాయణదాసు పిఠాపురం, ఏలూరు, విజయవాడ, బళ్ళారి, మద్రాసు నగరాల్లో హరికథా ప్రదర్శనాలనిస్తూ అనేక సంస్థానాల్లో సత్కారల నందుకున్నారు. బెంగుళూరులో తన హరికథా కథన ప్రజ్ఞను ప్రదర్శించి మైసూరు మహారాజా దర్బారున కాహ్వానింప బడి గొప్ప సన్మానాన్ని పొందారు. విధంగా అన్య ప్రాంతాల్లో సన్మానల నందుకున్న దాసుగారి కీర్తిని గుర్తించిన ఆనంద గజపతి మహారాజు దాసుగారిని అహ్వానించి దర్బారు పండితుణ్ణిగా చేసారు. ఆనంద గజపతి మరాణానంతరం దారు మరల ఆంధ్ర దేశ మంతటా హరికథ ప్రదర్శనాలిచ్చారు. 1919 సంవత్సరంలో ఆనాటి విజయనగర సంస్థానాధీశ్వరుడు శ్రీ విజయరామ గణపతి సంగీత పాఠశాల నొకదానిని స్థాపించి దానికి ఈయనను అధ్యక్షులుగా నియమించారు. పదవిలో ఆయన 17 సంవత్సరాలు పని చేశారు. 1936 లో ఉద్యోగాన్ని వదిలి వేశారు. వృద్యాపం వచ్చే కొద్దీ కథలను తగ్గించి అనేక మంది శిష్యుల్ని తయారు చేసి ఆంధ్ర దేశ హరికథా పితామను డనిపించుకున్నారు. 1945 సంవత్సస్రం జనవరి 2 తేదీన మరణించారు.

శిష్యులూ, ప్రశిష్యులూ

ఆదిభట్ల నారాయణదాసు 80 సంవసరాలు జీ వించారు. వీరి శిష్యులైన వారు నారాయణదాసు సాంప్రదాయాన్ని అపారంగా ప్రచారం చేశారు. వీరేగాక, పాణ్యం సీతార భాగవతార్, పట్రాయని సీతారామశాస్త్రి, ప్రయాగ సంగయ్య, బాలాజీదాసు, కోసూరి భోగలింగదాసు, తంపిళ్ళ సత్యనారాయణ, ఎరుకయ్య మొదలైన మహమహులెందరో ఆంధ్ర దేశంలో హరిథా గానాన్ని ప్రచారం చేశారు.




సంగీతం,సాహిత్యం మరియు న్రుత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని స్రుజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు.సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.


తొలిజీవితం


1864 ఆగష్టు 31 న ఇప్పటి విజయనగరం జిల్లా, బొబ్బిలి వద్ద, ప్రస్తుతం బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులు దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక, ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచారు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా, పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవారు.
కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని పద్యాలు ఎన్నో చెప్పేవారట. ఒకసారి వారి అమ్మగారు పిల్లవాడిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళిందట. అక్కడ పుస్తకాల కొట్టులో, భాగవతం చూసి (బాల దాసు)అది కావాలి అని మారాం చేస్తుంటే, ఆ కొట్టు యజమాని, భాగవతం నీకేమి అర్థమవుతుంది అన్నాడట. అంతే ఆ కుర్రవాడు ఆపకుండా భాగవతం లోని పద్యాలు గడగడా చెప్పేశారట. అది చూసి, ఆ కొట్టు యజమాని ఆనందంగా పిల్లవానికి ఆ పుస్తకం తో పాటు, కొంత దక్షిణ కూడ ఇచ్చి పంపించాడుట.


ఇది ఇలా ఉండగా, ఒకసారి దాసు వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అరుగు మీద కూర్చుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే, అది చూసి వాళ్ళ తాతగారు ముచ్చటపడి, తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని వాళ్ళ అమ్మగారికి చెప్పాడట. దాంతో అప్పటిదాకా, ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది. ఒకప్రక్క సంగీత సాధన, ఇంకో ప్రక్క విద్యాభ్యాసం. ఇలా రెంటినీ అతను ఎంతో నేర్పుగా సంబాళించగలిగాడు చిన్నవయసులోనే. తన 14 వ ఏట ఒకటవ తరగతిలో చేరారు.



వ్యక్తిత్వం - వివాదాలు


అంతేగాక నారాయణదాసు ఈసఫ్ కథలను నూఱుగంటి పేరిట అనువదించి వీరేశలింగం ప్రచురణాలయానికి పంపగా, ఆ గ్రంథ ప్రచురణను తొక్కిపట్టి ఆ మార్గంలోనే ఈసఫ్ కథలను తానుకూడా తెనుగు చేసి ముందుగా ప్రకటించారు. అది విద్యార్థులకు పాఠ్యగ్రంథమైంది. తర్వాతే నూఱుగంటి వెలుగుచూసింది.



పాండిత్య ప్రకర్ష



తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. అష్టావధానాలు చేసేవాడు. అచ్చతెలుగులోను, సంస్కృతంలోను, సంస్కృతభూయిష్టమైన తెలుగులోను కూడా వివిధ విషయాలపై శతాధిక గ్రంథాలు రచించిన మహా పండితులు.

అంతకు ముందు తెలుగులో ఉమర్ ఖయ్యామ్ రుబాయితులను వ్రాసినవారు ఎక్కువగా ఎడ్వర్డ్ ఫిడ్జిరాల్డ్ రచించిన ఆంగ్ల రచననే మూలంగా తీసుకొన్నారు. అలా చేయడం వలన మూలగ్రంథాలలోని విషయం సరిగా చూపడం కుదరలేదని తలచారు ఆదిభట్ల నారాయణదాసు. ఈ విషయం ఋజువు చేయడానికి ఆయన పారశీక భాష లోని మూల గ్రంథం కవితలనూ, ఫిడ్జిరాల్డ్ ఆంగ్లానువాదాన్నీ కూడా అచ్చ తెలుగులోకీ, సంస్కృతంలోకీ వేరు వేరు ఛందస్సులలో అనువదించాడు. 1932లో వెలువడిన ఈ రచన పాండిత్యానికి పరాకాష్టగా ఆనాటి సాహితీకారులచే మన్నింపబడినది.
మరొక గొప్ప రచన - 1922లో ప్రచురితమైన నవరస తరంగిణి - ఇందులో సంస్కృత మహాకవి, నాటక కర్త కాళిదాసు రచనలనుండి, ఆంగ్లభాషలో ప్రసిద్ధ నాటక రచయిత షేక్స్‌పియర్ రచనలనుండి నవరసాల ను వర్ణించే ఖండికలను తెలుగులోకి అనువదించి చూపారు. కాని ఆయన రచనలలో ఉద్గ్రంథంగా చెప్పబడేది జగజ్యోతి అనే తాత్విక రచన. వివిధ భారతీయ తాత్వికుల సిద్ధాంతాలను, దృక్పథాలనూ ఈ గ్రంథంలో వివరించాడు. నాస్తిక వాదాలు కూడా విస్తృతంగా చర్చింపబడ్డాయి.

నారాయణదాసు సంస్కృత రచనలలో ముఖ్యమైనవి - మూడు హరికథల కూర్పు హరికథామృతం, స్వతంత్ర రచన తారకం, రెండు శతకాలు రామచంద్ర శతకం, కాశీ శతకం. దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనే పాటలో మంజరీ వృత్తంలో 90 రాగాలు కూర్చారు. అంతవరకూ ఎవరూ సాహసించని ఈ ప్రక్రియ సంగీతంలోనూ, కవితలోనూ నారాయణదాసుకు ఉన్న ప్రతిభకు తార్కాణం. ఋక్‌సంగ్రహం అనే బృహత్తర కావ్యంలో ఈయన ఋగ్వేదములోని 300 పైచిలుకు ఋక్కులకు సంగీతాన్ని సమకూర్చి, వాటిని వీణమీద వాయించడం విద్యార్ధులకు నేర్పారు. ఆ ఋక్కులను తెలుగులో గీతాలుగా అనువదించారు.

నారాయణదాసు సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షకు సమస్థాయిలో పరిమళించింది. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయనను లయబ్రహ్మ అనీ, పంచముఖి పరమేశ్వర అనీ సన్మానించారు. ఒకేమారు ఐదు తాళాలకు అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత. ఈ పంచముఖి ప్రదర్శనలో నారాయణదాసు రెండు చేతులు, రెండు కాళ్ళు, తలలతో ఐదు తాళాలకూ దరువు చూపేవారు. అప్పుడు ఆయనకు ఐదుగురు వివిధ వాద్యకారులు సహకరించేవారు. సంగీత సాహిత్య స్వర బ్రహ్మ అని ఆయనకు బిరుదు ప్రసాదించారు.

ఆనంద గజపతి నారాయణ దాసును తన ఆస్థాన విద్వాంసునిగా నియమించారు. ఒకసారి సభలో ఆయన దాసును ఏదో రాగం పాడమని అడిగారట. కానీ ఆయన నేను పాడను అని సభలో నుండి వెళ్ళిపోయారట. రాజు గారు కూడా దానికి ఏమి కోపం తెచ్చుకోలేదు. ఐతే తరువాత ఆయన వ్యాయామశాలలో వ్యాయామం చేస్తున్నప్పుడు, ఎందుకో ఆ రాగం గుర్తుకు వచ్చి, పాడడం మొదలుపెట్టారట. నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి. చుట్టూరా జనాలు ఉన్నారు. కానీ ఇవేవీ పట్టించుకొనే స్థితిలో లేరు నారాయణ దాసు. చివరికి పాడడం అయినతరువాత చూసుకుంటే ఒంటి మీద కేవలం గోచీ తప్ప ఏది లేదట. ఆ రాగం విన్న ప్రజలంతా ఆనందంతో ఇంటికి వెళ్ళిపొయారు. వెళ్ళిపోయిన ఆ జనంలో, ఆనంద గజపతి రాజు కూడా ఉన్నారట…!



హరికథా వైభవం


అయితే ఈయనకే ప్రత్యేకమైన హరికథ ని వెలుగులోకి తెచ్చింది మాత్రం జయంతి రామదాసు. అతని ప్రోద్బలంతో, మొదటి హరికథా కాలక్షేపానికి రంగం సిధ్ధమైంది. మొదటిది రాజమండ్రి లో ఏర్పాటు చేశారు. ఇప్పటిలా కరెంటు లేదు. మైకులు, సౌండ్ బాక్స్ లు లేవు. ఉన్నదల్లా, ఇసుక వేస్తే రాలనంత జనం, మధ్యలో వేదిక మీద నారాయణ దాసు. అంతే ఉన్నట్లుంది మ్రోగింది కంచు కంఠం . ఊరంతా ఉలిక్కిపడింది. గంభీరమైన ఆకారం, ఒక చేతిలో చిడతలు, కాళ్ళకి గజ్జెలు. అలా మొదటి హరికథ కి అంకురార్పణ జరిగింది.


ఇక ఆ తరువాత నారాయణ దాసు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతని ఖ్యాతి వాడవాడలా వ్యాపించింది.. మైసూర్ మహారాజు గారి నుండి ఆహ్వానం అందింది. మైసూర్ రాజా హరికథకి ముగ్ధుడైపోయాడు. దీనితో పాటు, వీణాగానం కూడా అడిగి మరీ విన్నాడు. పెద్దయెత్తున బహుమతులు సమర్పించాడు.


కవిత్వం, సంగీతం, నాట్యం అనే మూడు రంగాలలోనూ తనకున్న ప్రతిభను జోడించి నారాయణదాసు హరికథ అనే కళను అత్యున్నత శిఖరాలకు కొనిపోయారు. ఈ మూడింటి కలయికకూ భక్తి అనే భావం ప్రాణంగా హరికథలు రచించారు, చెప్పారు, నేర్పారు. ఆయన హరికథ వినడం ఒక గొప్ప అనుభూతిగా అప్పటివారు చెప్పుకొనేవారు. మొత్తం ఆయన తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చతెలుగులో ఒకటి హరికథలను రచించారు. కొన్నిమార్లు ఒక్కొక్క వర్ణన నాలుగైదు పేజీల నిడివి వరకూ సాగేవి.
ఒకమారు నారాయణదాసు కలకత్తాలో శ్రీకృష్ణజన్మ హరికథను సంస్కృతంలో గానం చేసి హిందీలో భావాన్ని వివరించారు.


అధ్యాపకునిగా


1919లో అప్పటి విజయనగరం మహారాజు స్థాపించిన శ్రీ విజయరామ గాన పాఠశాల కు మొదటి ప్రధానాధ్యాపకునిగా నారాయణదాసును నియమించారు. ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ఈయనకు సహాధ్యాపకునిగా ఉన్నారు. ఎందరో ప్రముఖ కళాకారులు ఈ విద్యాసంస్థనుండి ఆంధ్రదేశానికి లభించారు. వారిలో ఘంటసాల వెంకటేశ్వరరావు ఒకరు. నారాయణదాసు ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో చదువుకొన్నామని చెప్పుకోవడం అప్పట్లో ప్రతిష్టాత్మకంగా భావించేవారు.



నారాయణదాసు హిందూస్థానీ భైరవి రాగాలాపనను గురుదేవులు రవీంద్రనాథ టాగూరు ఎంతగానో ప్రశంసించారు. ఈ విజయనగరం కళాశాల పాఠ్యాంశాలు శాంతినికేతన్ లో ప్రవేశపెట్టబడ్డాయి.
ఈయన సకల కళా నైపుణ్యానికి ముచ్చటపడిన బ్రిటీష్ వారు ఆయనను నోబుల్ పురస్కారానికి నామినేట్ చేద్దామనుకున్నారట. కానీ నారాయణదాసు ఒప్పుకోలేదట. తన జీవితం మొత్తం, తాను జన్మించిన తెలుగు గడ్డకి తన వంతు సేవ చేసి, 1945, జనవరి 2వ తేదీన మరణించారు.
ఆ మహనుభావుని స్మారకార్దం మొదటి సారిగా విజయనగరం లో ఆనాటి వెన్లాక్ లైబ్రరీ తూర్పు గేట్ ఎదురుగా విగ్రహ ప్రతిష్ఠించారు.










================================
ప్రముఖ హరి కథకులు
==================================


హరికథల్లో మొదటిది తాళ్లూరి నారాయణ కవి వ్రాసిన మోక్షగుండ రామాయణం.

తర్వాత సింగరిదాసు, నరసింహదాసు, సంగడి దాసు మొదలైన వారు అనేక హరికథలు వ్రాసి గానం చేశారు.

* అయితే హరికథకు అంతులేని ప్రాచుర్యాన్ని, కథకులకు మార్గానిర్దేశాన్ని చేసిన "హరికథా పితామహుడు" అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు.

నారాయణదాసు సమకాలికులుగా

1.     చొప్పల్లి సూర్యనారాయణ
2.     బాలజీదాసు
3.     చేవూరి ఎరుకయ్య దాసు
4.     పాణ్యం సీతారామ భాగవతార్
5.     ప్రయాగ సంగయ్య
6.   కోడూరు భోగలింగదాసు

వంటి వారు సుప్రసిద్ధులుదాసు శిష్యుల్లో ....

7.     పసుమర్తి కృష్ణమూర్తి
8.     వాజపేయాజుల వెంకటసుబ్బయ్య
9.     నేతి లక్ష్మీనారాయణ
10.                        పుచ్చల భ్రమరదాసు
11.                        మైనంపాటి నరసింగరావు
12.                        పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసు
13.                        ముసునూరి సూర్యనారాయణ
14.                        పరిమి సుబ్రహ్మణ్యశాస్త్రి
15.                        ములుకుట్ల పున్నయ్య
16.                        అద్దేపల్లి లక్ష్మణదాసు

వంటి వారెందరో ఉన్నారు. శిష్యులకు శిష్యులు, ప్రశిష్యులు హరికథాగానాన్ని సుసంపన్నం చేశారు.

* దాసుగారి సమకాలీనులైన శ్రీ చొప్పల్లి సూర్యనారాయణదాసుగారి శిష్యుడు సామవేదం కోటేశ్వరరావు భాగవతార్. దివంగత రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరిచే రాష్ట్రపతి భవనంలో నెలరోజులు గానం చేసి సన్మానించడిన ఘనులు. వార్కి చాలా వరకు శిష్యులున్నారు

1.     గొల్లపూడి కళ్యాణి
2.     మోహనరావు
3.     ఉమ, జానకి
4.     రాధాదేవి
5.     సత్యవతి
6.     వరలక్ష్మి
7.     అన్నపూర్ణ
8.     కాళ్ళ నిర్మల ...

 ఇంకా ఎందరో…. అందులో కాళ్ళ నిర్మల మాత్రమే చెప్పుకోతగినవారు.

1.     ఆర్‌.దుర్గాంబ,
2.     బెజవాడ నాగరాజకుమారి

వంటి భాగవతారిణుల ప్రేరణతో ఇప్పుడు అనేకమంది భాగవతారిణులు హరికథాగానం చేస్తున్నారు. .



ప్రసిద్ధ హరిదాసులు

1.      సామవేదం కోటేశ్వరరావు
2.      వడ్లమాని నరసింహదాసు
3.      ఉమాకాంతదాసు
4.      బాలబ్రహ్మనంది దాసు
5.      బులుసు పాటివెంకటప్పయ్య
6.      బెజవాడ లింగ మూర్తి
7.      భమిడిపాటి వెంకటరమణ
8.      చిట్టిమళ్ళ రంగయ్యదాసు
9.      శలక వరపు లింగమూర్తి శర్మ
10.                        పెద్దింటి సూర్య నారాయణ దీక్షిత దాసు
11.                        పాతూరి మధుసూదన రావు
12.                        చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్
13.                        మహావాది వెంకటప్పయ్య
14.                        కోసూరి పున్నయ్య
15.                        కొండపల్లి కళ్యాణ దాసు
16.                        మైనంపాటి నరసింగ రావు
17.                        కడలి వీర దాసు
18.                        శ్రీమాతి ఆర్. దుర్గాంబ
19.                        మహేంద్రవాడ కామేశ్వర రావు
20.                        పిల్ల మఱ్ఱి రామదాసు
21.                        ములుకుట్ల సదాశివ శాస్త్రి
22.                        రాజశేఖరుని లక్ష్మీపతి రావు
23.                        పొడుగు పాండురంగ దాసు
24.                        తాతిన సీతారాయ్య
25.                        ములుకుట్ల పున్నయ్య శాస్త్రి
26.                        శ్రీమతి యస్. రాజకుమారి చౌదరి
27.                        నవుడూరి విశ్వనాథ శాస్త్రి
28.                        పొట్లూరి వెంకట రామయ్య
29.                        ముట్నూరి సూర్యనారాయణ శాస్త్రి
30.                        బంకుపల్లి సింహాచల భాగవతార్
31.                        చిట్యాల ఆంజనేయ భాగవతార్
32.                        శ్రీ మతి బేబి రాణి, బసవలింగం
33.                        అమ్ముల విశ్వనాథం
34.                        కోట్ఘ సచ్చిదానంద శాస్త్రి
35.                        గొర్తి కొండయ్య శాస్త్రి భావతార్ {col-4}}


మొదలైన ప్రసిద్ధ హరి కథకులు నారాయణ దాసు లాంటి పెద్దల బాటల్లో నడచి హరికథ కళను ప్రచారం చేశారు.


మరుపురాని మరికొందరు హరిదాసులు

ఈనాడు ఆంధ్ర దేశంలో హరి కథ గానకళ విస్తృతంగా వ్యాపించి ప్రజల నెంతగానీ ఆకర్షిస్తూoది. రాష్ట్ర వ్వాపితంగా కళను క్రింద ఉదహరించిన ఎంతో మంది కళారాధకులు ప్రచారం చేస్తున్నారు.

36.                        కాళ్ళ నిర్మల (విజయనగరం)
37.                        గొల్లపూడి కళ్యాణి (విజయనగరం)
38.                        మిక్కిలి నేని పరంధామయ్య (కోవెన్ను)
39.                        ఘట్టి శేషాద్రి (రేలంగి)
40.                        చదలవాడ వెంకట్రాయుడు (భిమవరం)
41.                        వీర్ల రామచంద్రయ్య (తణుకు)
42.                        చిట్యాల పార్థ సారథి (తాడేపల్లి గూడెం)
43.                        అన్నమనీడి బాలకృష్ణ (రామచంద్ర పురం)
44.                        మట్టా వజ్ర శేఖర్ (వుప్పాక పాడు)
45.                        గూన పల్లి తాతావారావు (రామచంద్రపురం)
46.                        సుంకర నరసింహారావు (కొమరగిరి పట్నం)
47.                        కొకకళ్ళ చిన వెంకన్న (రావులపర్రు)
48.                        బద్దిరెడ్డి సుబ్బారావు (సుందరపల్లి)
49.                        అయినం అప్పలదాసు(తాడేపల్లి గూడెం)
50.                        తాడేపల్లి వరలక్ష్మి (తెనాలి)
51.                        ముట్నూరి కుటుంబరావు(పెదకళ్ళే పల్లి)
52.                        వాజపేయాజుల రామ నాథశాస్త్రి (వుంగుటూరు)
53.                        యాళ్ళబండి శారద (తాడేపల్లి గూడెం)
54.                        ఆత్మకూరు గురు బ్రహ్మగుప్త (పిడుగురాళ్ళ)
55.                        వంగవోలు సుబ్బారావు (ఎన్నయ్యపాలెం)
56.                        తిరునగరి సత్యవాణి (తెనాలి)
57.                        కోట సుబ్బారావు (కొండయ్య పాలెం)
58.                        శీలం నారాయణదాసు (నర్సాపురం)
59.                        గిడుతూరి మాణిక్యాంబ (పత్తేపురం)
60.                        బృందావనం రంగాచార్యులు ( తాడేపల్లి)
61.                        రాయిపూడి సాంబశివరావు ( చావలి)
62.                        నడింపల్లి నారాయణ రాజూ (ఉండి)
63.                        వేపూరి పోతరాజు (కోనేటి పురం)
64.                        గూడవల్లి సూర్యనారాయణ (రామచంద్ర పురం)
65.                        శీలం గంగరాజు (పెనుగొండ)
66.                        తిరువాయిపాటి రామారావు (తెనాలి)
67.                        వఝ్ఝూ అప్పయ్య చౌదరి (గోలమూడి)
68.                        ముద్దుల కోటేశ్వర గుప్త ( పాలకొల్లు)
69.                        సిగిడి సూరారావు( ఉండి)
70.                        వీరగంధం వెంకట సుబ్బారావు (తెనాలి)
71.                        జి.వి. శివయ్యదాసు (పెడన)
72.                        మెట్ట బలరామ మూర్తి (ఉండి)
73.                        అవుతు సోమారెడ్డి (చినపరిమి)
74.                        అక్కిపెద్ది శ్రీఈరామ శర్మ (విజయవాడ)
75.                        వంకా వెంకట్రామయ్య (తణుకు)
76.                        సజ్జల చిన ఓబుల రెడ్డి (కొప్పోలు)
77.                        తుమ్మిరిసి హనుమంత రావు ( త్యాజంపూడి)
78.                        కంచర్ల బాలకృష్ణదాసు (తాడేపల్లి గూడెం)
79.                        తాడాల వెంకటరత్నం (పొలమూరు)
80.                        కాపవరపు పాపారావు (పెదమొరం)
81.                        మెట్టా వెంకఆటేశ్వర రావు (కైకరం)
82.                        కన్నేపల్లి నీలకంఠశాస్రి. (ఉండి)
83.                        నంద్యాల రాయుడు (తాడేపల్లి గూడెం)
84.                        నడింపల్లి విశ్వనాథ శాస్త్రి ( గరికి పర్రు)
85.                        బాసం శెట్టి మల్లయ్య (మాముడూరు)
86.                        బి.సింహాచలం (పెరమరం)
87.                        ముకుకుట్ల సీతారామశాస్త్రి (తాడేపల్లి గూడెం)
88.                        తాడాల నరసింహస్వామి
89.                        పొలమూరు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి( తణుకు)
90.                        కాజన విశ్వరూపాచారి (శిరిపురం)
91.                        ఆకురాతి నాగేంద్రం (పెడన)
92.                        వృధివి బసవ శంకరయ్య(పెడన)
93.                        జోశ్యుల సత్య నారాయణ (శీనలి)
94.                        ఖండవల్లి తారక రామం (ఎదురులంక, యానాం)
95.                        ముదుపాక మల్లేశ్వర రావు (భీమవరం)
96.                        కల్లే బాలకృష్ణదాసు (విజయవాడ)
97.                        అంబటిపూడి శివరామ కృష్ణ మూర్తి(విజయవాడ)
98.                        శభాన రామారావు (వేలపర్ల)
99.                        డి. జ్యోతిర్మయాంబ ((ఏలూరు)
100.                   గోవర్థనం వెంకటాచార్యులు (కేశవరం)
101.                   పంచాగ్నుల విశ్వనాథ శర్మ (సికిందరాబాదు)
102.                   షణ్ముఖి లోకనాథ రాజు ( భీమవరం)
103.                   పట్నాల వీరభద్రాచార్యులు (చాగల్లు)
104.                   కోట ల్లక్ష్మీకాంతం (వంగోలు)
105.                   మల్లాది శ్రీరామ మూర్తి (ఏలూరు)
106.                   . సత్యనారయణ (మండపేట)
107.                   వి.రామమూర్తి,( ద్రోణాచలం)
108.                   ఆదిలక్ష్మి శర్మ (ఏలూరు)
109.                   బి. కాశీవిశ్వనాథ్(గద్వాల)
110.                   వేములవాడ జగన్నాధం పంతులు (తెనాలి)
111.                   పెండెం ధర్మారావు (ముమ్మిడివరం)
112.                   వెలిదెన నరసింహమూర్తి ( వరంగల్)
113.                   జవ్వాజి నాగమణి (అనంతపురం)
114.                   బాల సుందర భాగవతార్ (భీమవరం)
115.                   బాదం బాలసుబ్రహ్మణ్య గుప్త (కాకినాడ)
116.                   శేషభట్టరు భావనాచార్యులు నిడుమనూరు (నల్లాగొండ)
117.                   సలాది భాస్కర రావు (కాకినాడ)
118.                   కొచ్చర్ల మల్లేశ్వరి
119.                   మునిముని లక్ష్మి, కరకాంపల్లి, (చిత్తూరు జిల్లా)
120.                   . రంగమాంబ భాగవతారిణి (తిరుపతి)
121.                   నదితోక రూపకుమారి ( పార్వతీ పురం)
122.                   తూములూరి లక్ష్మణ శాస్త్రి. (విజయవాడ)
123.                   సి.హెచ్. లక్ష్మీనరసింహాచార్యులు ఉప్పల్ (హైదరాబాదు)
124.                   తరకటూరి లక్ష్మీ రాజ్యం భాగవతారిణి (మచిలీ పట్నం)
125.                   మంగిపూడి వెంకటరమణ మూర్తి (రాముడు వలస)
126.                   ముప్పవరపు వెంకట సింహాచల భాగవతారు, (పాత గుంటూరు)
127.                   వీరగంధం వేకట సుబ్బారావు భాగవతారు (తెనాలి)
128.                   కలికివాయి విజయ శ్రీ, భాగవారిణి (తాడేపల్లి గూడెం)
129.                   మహారెడ్డి శ్రీనివాసరావు (నరసన్న పేట)
130.                   సంగమారాజు మణి భాగవతారు (సత్యవీడు)
131.                   గరిమెళ్ళ సత్యవతి భాగవతారిణి (మదనపల్లి)
132.                   నిడుముక్కల సాంబశివరావు, అరండల్ పేట,(గుంటూరు)
133.                   గునపల్లి సూర్య నారాయణ భాగవతార్, నాంపల్లి, (హైదరాబాదు).
134.                   పునుగు శేషయ్య శాస్రి, మెహిదిపట్నం (హైదరాబాదు)
135.                   వోడారేవు రామారావు, తూర్పు గోదావరి జిల్లా
136.                   వేదంభట్ల వెంకట రామయ్య
137.                   సూర్తావారు
138.                   మరువాడ రామమూర్ఫ్తి
139.                   బాలంత్రపు లలిత కుమార్

మొదలైన వారెందరో రాష్ట్ర వ్వపితంగా హరికథా గానం చేసి పేరెన్నిక గన్నారు. పైన ఉదహరించిన వారిలో అనేక మంది కీర్తి శేషులయ్యారు. మరెంతో మంది వృద్ధ్యాప్యంతో బాధలు పడుతున్నారు.