శ్రీ కపిలవాయి రామనాథ శాస్త్రి
కపిలవాయి రామనాథ శాస్త్రి గారంటే గురుభావం..ఆనాటివారిలో చాలామందికి ఆయన ఆదర్శం. ఆ రోజుల్లో కపిలవాయి రామనాథ శాస్త్రి పద్యాలు విని జనం ముగ్ధులయేరు.
చాలా సంవత్సరాల క్రిందట రేడియోలో “సజీవ స్వరాలు” శీర్షికన పాత "gramophone songs" గ్రాంఫోన్ పాటలను ప్రసారం చేయటం జరిగింది.
శ్రీ వేంకట రమణ గారు (శోభనాచల బ్లాగు) దగ్గరవున్న రేడియో రికార్డింగ్స్ నుంచి కపిలవాయి రామనాధ శాస్త్రి గారి “భలేమంచి చౌకబేరము”పాటను పోస్ట్ చేయటం జరిగింది. ఈ పాటతో పాటు సేకరించిన గ్రాంఫోన్ పాటల పుస్తకాన్నుండి ఆ పాట సాహిత్యాన్ని కూడా పోస్ట్ చేయటం జరిగింది. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఘంటసాల గారు పాడిన ఇదే పాట మనందరకు బాగా పరిచయం. కపిలవాయి రామనాధ శాస్త్రి గారి గురించిన చాలా వివరాలు మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారి “నటరత్నాలు” పుస్తకంలో దొరుకుతాయి. మనకు లభ్యమవుతున్న ఆయన పాడిన పాటలలో ఇది చాలా మధురమైన పాట.
(మూలం - శ్రీమాన్ వేంకట రమణ గారు - శోభనాచల బ్లాగు)